చిరకాల కోరిక నెరవేరింది!

23-11-2026 | 05:20am

కోలీవుడ్ కథానాయిక(Kollywood actress) ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan).. ప్రముఖ దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మంజనథి’ సినిమాలో నటిస్తున్నది. ఈ చిత్రంలో నటించడం తన చిరకాల కోరిక నెరవేరినట్లుగా ఉందని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ‘కొన్ని సినిమాలు ప్రారంభం కాకముందే మనసులో ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. మంజనథి కూడా అలాంటి సినిమానే. ఈ సినిమా స్క్రిప్టును చదువుతున్నప్పుడు ఎంతో ఆత్మీయత, భావోద్వేగాలతో నిండిన ఒక కొత్త ప్రపంచానికి దగ్గరవుతున్న అనుభూతి కలిగింది.

మారి సెల్వరాజ్‌తో కలిసి పనిచేయాలని నేను ఎప్పటినుంచో కోరుకుంటున్నా.  నా చిరకాల కోరిక ఈ సినిమాతో నెరవేరింది’ అని అన్నారు. ఇళయరాజా సర్ సంగీతం నాకు చాలా ఇష్టం. ఆయన సంగీతం అందిస్తున్న సినిమాలో నటించే అవకాశం రావడం మరింత ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. 

మరిన్ని వార్తలు