న్యాయవ్యవస్థ, బీసీసీఐపై పూర్తి విశ్వాసం: టీసీఏ

29-09-2026 | 05:10am

హైదరాబాద్, సెప్టెంబర్ 28: తమకు బీసీసీఐ(BCCI) పూర్తి సభ్యత్వం కల్పించాలన్న దీర్ఘకాలిక డిమాండ్‌కు సంబంధించి న్యాయవ్యవస్థపై(Judiciary), భారత క్రికెట్ నియంత్రణ మండలిపై(Board of Control for Cricket in India) సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. న్యాయం, రాజ్యాంగబద్ధత, పారదర్శకత, జవాబుదారీతనం ఆధారంగా తమ హక్కు చివరకు పరిష్కారమవుతుందన్న నమ్మకంతో టీసీఏ ముందుకు సాగుతోందని తెలిపింది. మరో కీలక విచారణను ఎదుర్కొంటున్న సందర్భంలో టీసీఏ తన న్యాయపోరాటా న్ని పూర్తి విశ్వాసంతో కొనసాగిస్తోందని ప్రధాన కార్యదర్శి ధర్మ గురువారెడ్డి(Dharma Guruva Reddy) తెలిపారు.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association)  కార్యకలాపాల పరిమిత భౌగోళిక ప రిధిపై తలెత్తిన ప్రశ్నల నేపథ్యంలో టీసీఏ అభ్యర్థించిన అసోసియేట్  లేదా పూర్తి సభ్యత్వ విజ్ఞప్తిని బీసీసీఐ పరిశీలించాలని గతంలో బాంబే హైకోర్టు(Bombay High Court) ఆదేశించిన విషయాన్ని ఆ యన గుర్తుచేశారు. భారత క్రికెట్ పరిపాలన రాజ్యాంగబద్ధత, పారదర్శకత, జవాబుదారీతనం, మెరిట్ వంటి ప్రాథమిక సూత్రాలపై నడవాల్సి ఉందని  గురువారెడ్డి అన్నారు. తెలంగాణలో క్రికెట్ పరిపాలన గత కొన్నేళ్లుగా తీవ్రమైన సంస్థాగత, ఆర్థిక సమస్య లను ఎదుర్కొంటోందని, బీసీసీఐ రాజ్యాం గం మరియు సుప్రీంకోర్టు నిర్దేశించిన క్రికెట్ సంస్కరణల అమలుపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: ఉద్యోగాల పరీక్షల షెడ్యూల్ విడుదల

బీసీసీఐ సభ్యత్వానికి సంబంధించిన రా జ్యాంగ నిబంధనలు, హెచ్‌సీఏపై నమోదైన సంస్థాగత ఆర్థిక అంశాలే టీసీఏ వాదనలకు ఆధారమని తెలిపారు. టీసీఏకి గుర్తింపు ఇవ్వడం కేవలం పరి పాలనా మార్పు కాదనీ, అది తెలంగాణ గ్రామీణ స్థాయిలో బలోపేతం చేయడానికి, ప్రతిభా వనరులను విస్తరించడానికి, హైదరాబాద్‌కు అవతల ఉన్న వేలాది యువ క్రికె టర్లకు సమానమైన అవకాశాల మార్గాన్ని సృష్టించడానికి ఒక చారిత్రాత్మక అవకాశంగా నిలుస్తుందన్నారు.

మరిన్ని వార్తలు