దుమ్మురే పిన అథ్లెట్లు
- ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో పతకాల మోత
- జావెలిన్‌త్రోలో రెండు మెడల్స్
- లాంగ్ జంప్‌లో మురళికి రజతం
- హర్డిల్స్‌లో పీటీ ఉష రికార్డు బ్రేక్
- పారుల్ చౌదరికి మరో పతకం
నగోయా, సెప్టెంబర్ 28 : ఆసియా క్రీడల(Asian Games) ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో(Track and field) భారత అథ్లెట్లు(Indian athletes) దుమ్మురేపుతున్నారు. అంచనాలకు తగ్గట్టే పతకాల మోత మోగిస్తున్నారు. స్వర్ణం రాకపో యినప్పటికీ, మన అథ్లెట్లు రజతాలు(Silver medals), కాంస్యాలతో సత్తా చాటుతున్నారు. పురుషుల జావెలిన్‌త్రోలో భారత అథ్లెట్లు యశ్వీర్ సింగ్(Indian athlete Yashvir Singh) రజతం, రోహిత్ యాదవ్ కాంస్యం సాధించారు. యశ్వీర్ సింగ్ 85.72 మీటర్ల దూరం ఈటెను విసిరి రజత పతకం కైవసం చేసుకున్నాడు. రోహిత్ యాదవ్ 84.35 మీటర్ల త్రోతో కాంస్య సాధించాడు.
ఇవి కూడా చదవండి: రజతంతో మెరిసిన ఇషా
ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా గాయం కారణంగా ఈ పోటీలకు దూరమవగా, ఈ ఇద్దరు అథ్లెట్లు భారత్‌కు డబుల్ పోడియం విజయాన్ని అం దించారు. శ్రీలంక అథ్లెట్ రుమే శ్ పతిరంగ పసిడి పతకం సాధించాడు. మరోవైపు మ హిళల 400 మీటర్ల హా ర్డిల్స్‌లో భారత అథ్లెట్ విథ్యా రామ్రాజ్ దిగ్గజం పీటీ ఉష రికార్డును బ్రేక్ చేయడమే గాక కాంస్య పతకం తో మెరిసింది. 400 మీటర్ల హారిల్స్‌ను విథ్యా రామ్‌రాజ్ 54.75 సెకన్లలో పూర్తి చేసి మూ డో స్థానంలో నిలిచి కాం స్యం ఒడిసిపట్టింది.
198 4 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో(Los Angeles Olympics) 400 మీటర్ల హార్డి ల్స్‌లో పీటీ ఉష నెలకొల్పిన 55.42 సెకన్ల టై మింగ్‌ను 0.67 సెకన్ల వ్యవధిలో బద్దలుకొట్టిన విథ్యా రామ్‌రాజ్ తన పే రును లిఖించుకుంది. భా రత స్టార్ స్ప్రింటర్ పారు ల్ చౌదరీ ఆసియా గే మ్స్‌లో రెండో పతకం సాధించింది. ఇప్పటికే 3వేల మీటర్ల స్టీపుల్ చేజ్‌లో కాంస్యం సా ధించిన పారుల్ చౌదరీ సోమవారం 5వేల మీటర్ల స్టీపుల్‌చేజ్ రేసులో కాంస్యం ఒడిసిపట్టింది. ఆమె గమ్యాన్ని 15:14.61 సెకన్లలో పరుగు పూర్తి చేసింది. అలాగే లాంగ్ జంప్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్ సత్తా చాటాడు.
పురుషుల లాంగ్ జంప్‌లో మురళీ 8.07 మీటర్ల దూరం దూకి రజతం సొంతం చేసుకున్నాడు. గత ఆసియా గేమ్స్‌లోనూ రజ తమే సాధించిన మురళీ ఈసారి స్వర్ణం కో సం ప్రయత్నించాడు. చీలమండ గా యం తో చివరి రెండు ప్రయత్నాలు విరమించుకోవడంతో మురళీ శ్రీ శంకర్ రజతంతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. లాంగ్ డిస్టెన్స్ రన్న ర్ గుల్వీర్ సింగ్ ఆసియా గేమ్స్‌లో రెండో ర జతంతో మెరిశాడు. ఇప్పటికే 10వేల మీట ర్ల పరుగులో రజతం గెలిచిన గుల్వీర్ సో మవారం జరిగిన 1500 మీటర్ల ఫైనల్లో రెం డో స్థానంలో వెండి పతకాన్ని కొల్లగొట్టాడు. 1 500 మీటర్ల రేసును గుల్వీర్ 3:36.72 నిమిషాల్లో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు.