ఎస్జీఎఫ్ కార్యాలయంలో దొంగలు
21-09-2026 | 09:49pm
సిద్దిపేట,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా(Siddipet District) కేంద్రంలోని ఎస్జీఎఫ్ కార్యాలయంలో దొంగలు పడ్డారు. మంగళవారం నుండి ఎస్జీఎఫ్ గేమ్స్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం కార్యాలయానికి వెళ్లిన మాజీ సెక్రటరీ సౌందర్యకు దొంగలు(Thieves) పడ్డారన్న విషయం తెలియడంతో ఈ విషయం గత సెక్రటరీకి తెలియజేశారు. సిద్దిపేట వన్ టౌన్(Siddipet One Town) పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. గతంలో సెక్రటరీ గా పని చేసిన రమేశ్వర్ రెడ్డి సౌందర్యకు పూర్తి స్థాయిలో ఛార్జ్ ఇవ్వలేదని సమాచారం. అయితే ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారిందని జోరుగా చర్చ జరుగుతోంది.