బీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా రంగు వినయ్
27-10-2026 | 05:05pm
నంగునూరు, అక్టోబర్ 27 :నంగునూరు మండలంలోని గట్లమల్యాల గ్రామంలో బీఆర్ఎస్వీ నూతన అధ్యక్షుడిగా రంగు వినయ్ కుమార్ ను(Rangu Vinay Kumar appointed as the new president of BRSV) ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఉపాధ్యక్షుడు గా ముడికే అజయ్ ,ప్రధాన కార్యదర్శిగా బుద్ధి శ్రీకాంత్‌లతో పాటు మొత్తం 15 మందితో కూడిన కమిటీలను సర్పంచ్ నరేష్ ఆధ్వర్యం లో మండల సమన్వయ కమిటీ ప్రకటించింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆదేశాల మేరకు నూతన కమిటీల నియామకం చేపడుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.