చెల్పూర్ శివారులో పేకాట స్థావరంపై దాడి

27-10-2026 | 06:17pm

ఏడుగురి అరెస్టు రూ.7,690 నగదు, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం

గణపురం, అక్టోబర్ 27 (విజయ క్రాంతి): గణపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని చెల్పూర్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా నేర పరిశోధన విభాగం సీఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ దాడి నిర్వహించారు.పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రూ.7,690 నగదు, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం గణపురం పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించారు.మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు