క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ
27-10-2026 | 06:19pm
యాదగిరిగుట్ట, అక్టోబర్ 27 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో నిత్య పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవారం క్షేత్ర పాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విష్ణు పుష్కరిణి ఆవరణలో గల ఆంజనేయ స్వామికి అర్చక బృందం మన్య సూక్త పారాయణముతో అభిషేకం నిర్వహించి సింధూరంతో అలంకరించిన స్వామి వారికి వివిధ రకాల సుగంధం వెదజల్లే ద్రవ్యాల పూలమాలలతో అలంకరించి నాగవల్లి దలార్చన నిర్వహించారు. ఈ ఆకు పూజలో భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.