నూతన ఎస్‌ఐను కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

27-10-2026 | 06:16pm

నస్రుల్లాబాద్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల నూతన ఎస్‌ఐ సాయి కృష్ణ(SI Sai Krishna)ను ఎమ్మార్పీఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల సీనియర్ నాయకులు శాంతయ్య మాదిగ, మేత్రి గంగారం, తరుణం పోశయ్య, టేకుల సాయిలు, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ ఇన్‌చార్జి మావురం శ్రీకాంత్ మాదిగ, బోయి సాయిల్ మాదిగ, ఎంఎస్‌ఎఫ్ కామారెడ్డి కో-ఇన్‌చార్జి మెక్క సాయి మాదిగ, బీర్కూరు మండల నాయకులు రాచకొండ కుమార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు