రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యం : వంగ రాజేశ్వర్ రెడ్డి

09-09-2026 | 06:22pm

రైతులకు 18 గంటల నిరంతర విద్యుత్‌ అందించాలి

సిద్దిపేటరూరల్: రైతుల సమస్యల పరిష్కారానికి రాజకీయాలకు అతీతంగా అండగా ఉంటానని వంగ రాజేశ్వర్ రెడ్డి(Vanga Rajeshwar Reddy) అన్నారు. రైతులకు ప్రస్తుతం అందుతున్న విద్యుత్‌ సరఫరా సరిపోవడం లేదని, పంటలను కాపాడేందుకు కనీసం 18 గంటల పాటు నిరంతర విద్యుత్‌ అందించాలని డిమాండ్ చేశారు. వర్షాలు సకాలంలో కురవక రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో విద్యుత్‌ సరఫరా పెంచాలని కోరుతూ ఎస్‌ఈకి వినతిపత్రం అందజేశారు. సిద్దిపేట పరిసరాల్లో కాల్వలు ఉన్నప్పటికీ చెరువులు, కుంటలకు సాగునీరు చేరకపోవడం దురదృష్టకరమన్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను వినియోగించి చెరువులను నింపేలా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.

మరిన్ని వార్తలు