ప్రజల్లో చైతన్యం నింపిన కాళోజీ

09-09-2026 | 07:38pm

ముకరంపుర,(విజయక్రాంతి): ప్రజాకవి కాళోజీ నారాయణరావు  తన కవిత్వం, రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్(Karimnagar Collectorate) కాన్ఫరెన్స్ హాల్లో కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాలను(Kaloji Narayana Rao Jayanti celebrations) జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.  అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు, ఉద్యోగులు, కలెక్టరేట్ సిబ్బంది కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ కాళోజి తన కవితలు, రచనల ద్వారా ప్రజల్లో స్ఫూర్తి నింపారని, ప్రజా అవసరాల కోసం నిరంతరం కృషి చేశారని అన్నారు. తెలంగాణ భాష, సాహితీ సేవకు అంకితమయ్యారని, అణిచివేత, అన్యాయాలపై ధిక్కారస్వరం వినిపించారని అన్నారు. కాళోజి మార్గాన్ని అనుసరించి ప్రజలకు సేవ చేయాలన్నారు.

మరిన్ని వార్తలు