ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి

23-11-2026 | 06:39pm

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి, నవంబర్ 23 (విజయక్రాంతి): ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్(District Collector Ashish Sanguwan) అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి లో 81 ఫిర్యాదులు కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే ఆశతో ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా సంబంధిత శాఖల అధికారులు పనిచేయాలని సూచించారు.

ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక శ్రద్ధ వహించి, క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, గిరి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు