అలరించిన జానపద నృత్య పోటీలు
ఆసిఫాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లా స్థాయి జానపద నృత్య పోటీలు(Folk Dance Competition) నిర్వహించారు. కౌటాల కేజీబీవీ విద్యార్థినులు లావణ్య, మీనాక్షి, ప్రశాంతి, ఊర్మిళ, వైష్ణవి, పల్లవి ప్రథమ బహుమతి సాధించారు.
జైనూర్ కేజీబీవీ విద్యార్థినులు లక్ష్మి, కేజర్, వైష్ణవి, గౌతమి, శ్రీవల్లి, దేవి ద్వితీయ బహుమతి, వాంకిడి కేజీబీవీ విద్యార్థినులు అర్చన, రోజా, ప్రియాంక, అర్చన, శ్రీలత, హిందూ తృతీయ బహుమతి పొందారు. విజేతలకు సహాయక కమిషనర్ జనార్ధన్ బహుమతులు అందజేశారు. కౌటాల బృందం ఈనెల 26న హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననుంది. ఈ కార్యక్రమంలో ఉప్పులేటి శ్రీనివాస్, కొయ్యడ శ్రీనివాస్, బుర్సా భారతి, న్యాయనిర్ణేతలు రాజ కమలాకర్ రెడ్డి, కిల్లి వెంకట్రావు, నరసింహచారి పాల్గొన్నారు.