దళారులను నమ్మి మోసపోవద్దు
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
బెజ్జంకి: రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే(Paddy Procurement Centers) వడ్లను విక్రయించాలని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ(MLA Dr. Kavvampally Satyanarayana) సూచించారు. శుక్రవారం బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి, దాచారం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పిస్తుందని తెలిపారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీరు, టెంటు సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్, మాతంగి అనిల్, వైస్ చైర్మన్ పర్ష సంతోష్, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు, ఐకేపీ కేంద్రాల మహిళా నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.