సర్వేకు సహకరించండి.. సమస్య పరిష్కరిస్తాం

03-11-2026 | 12:17am
  1. మంత్రి పొంగులేటిని కలిసిన శివారు వెంకటాపూర్ గ్రామస్తులు 
  2. 325 సర్వే నంబర్ కు సంబంధించిన పూర్తి వివరాలు నా వద్ద ఉన్నాయి
  3. సర్వేకు సహకరిస్తే మీ సమస్య పరిష్కారం అవుతుంది
  4. గ్రామస్తులకు హామీ ఇచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 

గజ్వేల్, నవంబర్ 2: మర్కూక్ మండలం శివారు వెంకటాపూర్ గ్రామస్తులు 325 సర్వేనెంబర్ లో కలిపిన 136 ఎకరాల భూ సర్వే గురించి  గ్రామస్థులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని(Revenue Minister Ponguleti Srinivasa Reddy) కలిసి సమస్యను విన్నవించారు. సోమవారం ఉదయం భూభారతి సర్వే చేయడానికి వచ్చిన తహసీల్దార్ సరిత, సర్వే అధికారులు సర్వేనెంబర్ 325 లోని శివారు వెంకటాపూర్, భూములపై స్పష్టత ఇవ్వాలని కోరినా అధికారులు సమస్యను పరిష్కరించకుండానే గ్రామంలోని భూములను సర్వే చేస్తామని చెప్పడంతో గ్రామస్తులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.

అధికారులు సమస్య పరిష్కరించడానికి సానుకూలంగా స్పందించకపోవడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వివరాలు వెల్లడించారు.  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించి సమస్య పరిష్కరిస్తానని  గ్రామస్థులకు హామీ ఇచ్చారని సమాచారం. అధికారులు చేస్తున్న సర్వేకు సహకరించాలని గ్రామస్తులను కోరారు.  సర్వే నంబర్ 325లో ఉన్న శివారు వెంకటాపూర్ గ్రామానికి చెందిన136 ఎకరాల భూమి వివరాలు తమ వద్ద ఉన్నాయని, సర్వే పూర్తి అయిన తరువాత అధికారులు ఇచ్చిన రిపోర్ట్ చూసి గ్రామస్తులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని సమాచారం.

ఇది ఇలా వుండగానే ఎర్రవల్లిలో ఈ రోజు తో శిఖం, అబాది, ప్రభుత్వ భూమి చెరువులు, కుంటల సర్వే పూర్తి అయిందని అధికారులు తెలిపారు. రేపటి నుండి ఎంజాయ్ మెంట్ సర్వే నిర్వహిస్తామని గ్రామస్తులకు ముందస్తుగానే 1 నుండి 100 సర్వే నంబర్లలో గల వారికి నోటీసులు అందచేసి సర్వే చేస్తామని ఇప్పటికే నోటీసులు సిద్ధం చేశామని రెవెన్యూ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు