భూమి వివాదం.. వ్యక్తి బలవన్మరణం

02-11-2026 | 11:57pm

సిద్దిపేట క్రైం, నవంబర్ 2 : భూమి వివాదం నేపథ్యంలో తన భర్త మృతిపై అనుమానం ఉందని భార్య సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్(Siddipet One Town Police Station) లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి వివరాల ప్రకారం.. సిద్దిపేటలోని భారత్ నగర్‌లో నివాసముంటున్న నర్సింహారెడ్డి అనే వ్యక్తి కొద్ది రోజులుగా భూమి విషయంలో ముగ్గురు వ్యక్తులతో వివాదం ఎదుర్కొంటున్నాడు. తన భర్త పేరుపై ఉన్న భూమిని ముగ్గురు వ్యక్తులు నమ్మించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని భార్య ఆరోపించింది.

ఈ క్రమంలో నవంబర్ 1న సాయంత్రం తన భర్త నర్సింహారెడ్డి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మృతిచెందినట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి చూడగా, పురుగుల మందు తాగి మృతిచెందినట్లు గుర్తించినట్లు తెలిపింది. భారత్ నగర్‌కు చెందిన అయిత హరికృష్ణ, మంతూరి దేవేందర్, సిరిసినగండ్ల గ్రామానికి చెందిన మిరురెడ్డి రాజుపై అనుమానం వ్యక్తం చేస్తూ, తన భర్త మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది.

మరిన్ని వార్తలు