18 ఏళ్ల పాటు సైన్యంలో సేవలు.. హవల్దార్ రమేష్ గౌడ్‌కు అభినందనలు
భిక్కనూర్, నవంబర్ 2 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన హవల్దార్ రమేష్ గౌడ్(Havildar Ramesh Goud) 18 ఏళ్ల పాటు భారత సైన్యంలో సేవలందించి పదవీ విరమణ పొందిన సందర్భంగా అత్తేల్లి శ్రీనివాస్ ఆయనను అభినందించారు. సుమారు ఏడేళ్ల పాటు జమ్మూ కాశ్మీర్లో దేశ రక్షణ విధులు(National defense duties in Jammu and Kashmir) నిర్వహించారని తెలిపారు.
2015లో దక్షిణాఫ్రికాలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో శాంతి పరిరక్షక విధుల్లో పాల్గొనడం, 2019లో గల్వాన్ ఘటనల సమయంలో లద్దాక్‌లో విధులు నిర్వహించడం విశేషమన్నారు. 2025లో ఢిల్లీలో నిర్వహించిన పరేడ్‌లో మొదటి ర్యాంక్ సాధించడం ఆయన ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. కుటుంబానికి దూరంగా ఉంటూ దేశ సేవకు అంకితమైన రమేష్ గౌడ్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ, ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.