నీట్ లో ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థికి స‌న్మానం

02-11-2026 | 11:40pm

మునిప‌ల్లి నవంబర్ 2 (విజయక్రాంతి ) ః మండ‌లంలోని  గార్ల‌ప‌ల్లి  గ్రామానికి చెందిన కోహీర్ అక్షిత నీట్ లో ఎంబీబీఎస్ మ‌హేశ్వ‌ర మెడిక‌ల్ కాలేజ్(Maheshwara Medical College (MBBS)) లో సీటు సాధించిన సంద‌ర్భంగా సోమ‌వారం  మునిప‌ల్లి ఎమ్మార్వో కార్యాల‌యంలో స‌న్మానించి అభినందించారు. ఈసంద‌ర్భంగా ఎంపీడీఓ అంజ‌య్య, ఎంఈఓ భీంసింగ్‌, డిప్యూటీ ఎమ్మార్వో ప్ర‌దీప్ త‌దిత‌రులు మాట్లాడుతూ చిన్ననాటి నుంచే  ఒక ల‌క్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగితే ఇలా ఉన్న‌తశిఖరాల‌కు ఎదుగుతార‌న్నారు.

మరిన్ని వార్తలు