నాలాల కబ్జాపై సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు

02-11-2026 | 11:38pm

కాగజ్ నగర్, నంబర్ 2 (విజయ క్రాంతి): నాలాల అక్రమ కబ్జాపై(Illegal encroachment of drains) కాగజ్ నగర్  సబ్ కలెక్టర్ హర్ష చౌదరికి సిర్పూర్ నియోజకవర్గ  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొన్న రమేష్  ఫిర్యాదు చేశారు. సోమవారం కొమరం ఆసిఫాబాద్ జిల్లా  కాగజ్నగర్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో  నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో  ఆయన  సబ్ కలెక్టర్కు  ఫిర్యాదు చేశారు. మండలంలోని ఎన్జీవోస్ కాలనీ --బారెగూడ శివార్ లో  గల  కాగజ్నగర్ మున్సిపాలిటీని  ఆనుకొని ఉన్న కోట్ల రూపాయల విలువైన నాలాను  కబ్జా చేసుకొని  కొందరు వ్యక్తులు అక్రమ కమర్షియల్ నిర్మాణాలు  చేపడుతున్నారని పేర్కొన్నారు. 

ఈ ప్రాంతం లో భూములకు అధిక విలువ ఉండడం, వాణిజ్య అవసరాలకు ఉపయోగకరంగా  ఉండడంతో కొంతమంది కబ్జాదారుల కన్ను పడినట్లు పేర్కొన్నారు. గతంలో స్థానిక ఎంపీడీవో, ఇరిగేషన్ డి ఈ, జిల్లా డిటిసిపికి సైతం ఫిర్యాదు చేసినప్పటికీ  నాలాల కబ్జాల  నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు .

మరిన్ని వార్తలు