సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

27-10-2026 | 07:59pm

నర్సంపేట సీఐ ఎం. శ్రీనివాస్

నర్సంపేట, అక్టోబరు 27( విజయ క్రాంతి ): ఎస్ ఆర్ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో(SR Vocational Junior College) మంగళవారం సైబర్ క్రైమ్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నర్సంపేట సీఐ ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ.విద్యార్థులు మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించి చదువుపై పూర్తి దృష్టి పెట్టాలని సూచించారు.

అపరిచిత లింకులు ఓపెన్ చేయడం, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఇతరులతో పంచుకోవడం వంటివి చేయరాదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నిహారిక మాట్లాడుతూ. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం, ఫొటోలు షేర్ చేయవద్దని తెలిపారు.

సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు లేదా అత్యవసర వేళల్లో 112 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కొయ్యడి సనత్ కుమార్, పారామెడికల్ ప్రిన్సిపాల్ శిరీష, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు