అక్రమ అరెస్టులకు భయపడేది లేదు

09-09-2026 | 01:27pm

కొమురవెల్లి,( విజయ క్రాంతి): అక్రమ అరెస్టులక భయపడేది లేదని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పెండింగ్(Pending) ఉన్న బిల్లులను వెంటనే రిలీజ్ చేయాలని మాజీ సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి గౌడ్ అన్నారు.  గ్రామపంచాయతీ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని  అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న మాజీ సర్పంచులను ముందస్తుగా స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.

అరెస్ట్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, ప్రభుత్వం ఎంత అణిచి  వేయాలని చూస్తే  అంతకంత ఉద్యమం ఉదృతం అవుతుందని  ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొమురవెల్లి సర్పంచ్ పద్మాంజనేయులు, బిఆర్ఎస్ నాయకులు  శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు