ధిక్కారమే కాళోజీ సంతకం!
కాళోజీకి కేటీఆర్ నివాళులు
హైదరాబాద్: కాళోజీ నారాయణరావు జయంతి(Kaloji Narayana Rao Jayanthi) సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) నివాళులర్పించారు. ప్రజల గొడవే తన గొడవగా జీవితంచిన మహానీయుడు కాళోజీ అన్నారు. నిరవంకుశత్వం, అణచివేతపై ప్రజలను చైతన్య పరిచిన ప్రజాకవి కాళోజీ అని KTR పేర్కొన్నారు. తెలంగాణ భాష బడి పలుగులు భాష కాదు.. పలుకుబడుల భాష అన్నారని స్పష్టం చేశారు. కాళోజీ జయంతిని కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) తెలంగాణ భాష దినోత్సవంగా నిర్వహించారని గుర్తుచేశారు.
ధిక్కారమే కాళోజీ సంతకం!
''ప్రజల గొడవే తన గొడవగా జీవించిన మహనీయుడు కాళోజీ నారాయణ రావు గారు. అక్షర రూపం దాల్చిన ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్ళకు కదలిక అంటూ... నిరంకుశత్వానికి, అణిచివేతకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచిన ప్రజా కవి కాళన్న. తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు... పలుకుబడుల భాష అని చాటిన కాళోజీ జయంతిని (సెప్టెంబర్ 9) కేసీఆర్ గారు తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించారు. వైద్య విశ్వవిద్యాలయానికి వారి పేరు పెట్టారు... వరంగల్లో సుందరమైన కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించారు. నేడు కాళోజీ నారాయణ రావు గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.'' అంటూ కేటీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.