గజ్వేల్‌లో కాంగ్రెస్ నిరసన ర్యాలీ

09-10-2026 | 11:45am

- రాహుల్‌గాంధీ పోరాటంతో బీజేపీలో వణుకు: అంక్షారెడ్డి

గజ్వేల్,(విజయక్రాంతి): ఓటు చోరికి వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ గురువారం సాయంత్రం గజ్వేల్‌లో కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కాయి. సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట అంక్షారెడ్డి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ(Congress candle rally) నిర్వహించి ప్రధాని నరేంద్ర మోదీ, సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్(CEC Gyaneshwar Kumar), బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంక్షారెడ్డి మాట్లాడుతూ మోదీకి సీఈసీ తొత్తుగా మారారని ఆరోపించారు.

ఎన్నికల సంఘాన్ని కీలుబొమ్మలా ఉపయోగించుకుని అక్రమ పద్ధతుల్లో అధికారం చేపట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలో ఇండియా కూటమి ఎంపీల ఆందోళనను అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. రాహుల్‌, ప్రియాంకగాంధీల పోరాటంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో వణుకు మొదలైందని, మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, సర్దార్ ఖాన్, అశోక్‌రెడ్డి, సుఖేందర్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, కౌన్సిలర్లు విష్ణువర్ధన్‌రెడ్డి, రమేష్, గుంటుకు శీను, మొహమ్మద్ సమీర్, వహీద్, జహీర్, అంజియాదవ్, గుంటుకు శ్రీనివాస్, సారిక శ్రీనివాస్‌రెడ్డి, చెప్యాల శేఖర్, జహంగీర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు