జీఎస్టీ అధికారులకు అరెస్ట్ అధికారం కట్

09-10-2026 | 05:25am
  1. ఇష్టమున్నట్లు తనిఖీలు చేసుడూ బంద్
  2. రూ. 10వేలలోపు పన్ను బకాయిలకు నోటీసులుండవ్
  3. చిరువ్యాపారులకు ఈ- సులభతర రిజిస్ట్రేషన్ 
  4. క్రిమినల్ ప్రాసిక్యూషన్ పరిమితి రూ. 5కోట్లపైనే!
  5. ఉద్యోగుల బీమాపై కంపెనీలకు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్
  6. పన్ను వివాదాల పరిష్కారానికి దేశవ్యాప్తంగా ఉమ్మడి రూల్స్
  7. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు
  8. వ్యాపారులకు, పన్ను చెల్లింపుదారులకు రక్షణ కల్పించేలా చర్యలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: వ్యాపారులకు, పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించేలా జీఎస్టీ కౌన్సిల్(GST Council) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ. 10వేలలోపు ఉండే పన్ను బకాయిలకు షోకాజ్ నోటీసులు జారీచేయొద్దని నిర్ణయించింది. జీఎస్టీ అధికారులకు ఉన్న అరెస్ట్ చేసే అధికారాన్ని రద్దు చేసింది. జీఎస్టీ చట్టంలోని కనీస శిక్ష అనే నిబంధనను కూడా తొలగించింది. క్రిమినల్ కేసు నమోదు చేయాలంటే.. ప్రాసిక్యూషన్ పరిమితి రూ. 5 కోట్లపైన ఉండాలని నిర్ణయించింది.

ఇన్నా ళ్లూ ఇది రూ. కోటి పైన ఉంది. సాధారణ జరిమానా మొత్తాన్ని రూ. 25వేల నుంచి 10వేలకు తగ్గించింది. వ్యాపార లావాదేవీలు సుల భతరం చేయడానికే ఈ మార్పులు తీసుకువస్తున్నట్లు జీఎస్టీ కౌన్సిల్ తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన గురువారం ఢిల్లీలో 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. తె లంగాణ నుంచి ఆర్థిక మంత్రి హోదాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. సమావేశంలో పలు అంశాలపై చర్చి ంచారు. అనంతరం నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 

జీఎస్టీ రేట్లలో మార్పు లేదు

జీఎస్టీ రేట్లలో, వాటికి సంబంధించిన వస్తువుల అంశంలో తాజా కౌన్సిల్ సమావేశంలో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్ర స్తుతం ఉన్న రేట్లే కొనసాగుతాయి. ఏడాదికి ఒక్కసారి జీఎస్టీ సవరణల అంశం ఉంటుందని, అది కూడా ఏటా ఏప్రిల్ 1 నుంచే అమలవుతుందని, ప్రతి జీఎస్టీ సమావేశంలో ఈ సవరణలపై నిర్ణయం ఉండదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. జీఎస్టీ రేట్లలో సవరణలు, మార్పుల కంటే.. సరళీకరించడంపైనే దృష్టి పెట్టామని, పన్ను చెల్లిం పుదారులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వొద్దన్న కోణంలో కౌన్సిల్ నిర్ణయాలు తీసుకుందని ఆమె చెప్పారు. 

దర్యాప్తు సంస్థలకు బదిలీ..!

జీఎస్టీ చట్టం ప్రకారం అధికారులకు ఉన్న అరెస్ట్ అధికారాన్ని తొలగిస్తూ కౌన్సిల్ నిర్ణ యం తీసుకుంది. రిటర్నులు ఆలస్యంగా దాఖలు చే యడం, అందులోని లోపాలు, పన్ను చెల్లింపు లో జాప్యం వంటి అంశాల్లో పన్ను చెల్లింపుదారులకు అరెస్టు నుంచి తప్పించే అవకాశం కల్పిం చాలని సమావేశంలో ప్రతిపాదించారు. కేవలం పన్ను వసూళ్లపైనే అధికారులు ఫోకస్ పెట్టనున్నారు.

అరెస్టుల జోలికి వెళ్లరు. చట్టపరమైన చర్యలకు సంబంధించిన కేసులను దర్యాప్తు సంస్థలు చూసు కుంటాయి. ప్రస్తుతం ట్యాక్స్ ఎగవేత, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)లో మోసాలు, తప్పుడు రిఫండ్ వంటి తీవ్రమైన నేరాల్లో కోటి  రూపాయలు దాటిన మొత్తానికి కమిషనర్ స్థాయి అధికారి ముందస్తు అనుమతి తో జీఎస్టీ ఆఫీసర్లు అరెస్టు చేసేలా వారికి అధికారాలు ఉన్నాయి.

ఈ నిబంధనల్లో మా ర్పులు చేస్తూ.. ఆ అధికారులకు అరెస్ట్ పవర్‌ను కట్ చేశారు. క్రిమినల్ ప్రాసిక్యూషన్ పరిమితి గతంలో రూ. ఒక కోటి ఉండగా.. ఇప్పుడు దా న్ని 5కోట్లకు పెంచింఇ. అంటే.. మోసం విలువ రూ. 5కోట్లుగా ఉంటేనే క్రి మినల్ కేసు నమోదవుతుంది. జీఎస్టీ మోసా ల్లో కనీస శిక్ష అనే రూల్‌ను కూడా తీసేశారు. దీంతో శిక్ష విధించడమైనా, జరిమానా విధించడమే కోర్టు పరిధిలోకి వెళ్లనున్నాయి. ఇక, సరుకుల రవాణా తనిఖీల అధికారాలను జీఎస్టీ అధికారులకు కాకుండా.. సరుకులు పంపే రాష్ట్రాలు, లేదా సరుకులను తీసుకునే రాష్ట్రాల అధికారులకు అప్పగించారు. దీంతో ఎక్కడపడితే అక్కడ జీఎస్టీ అధికారులు య థేచ్ఛగా తనిఖీలు చేయడానికి ఉండదు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వారు తనిఖీలు చేపడుతారు. 

రూ. 10వేల లోపు బకాయిలకు నోటీసులుండవ్

రూ. 10వేల లోపు పన్ను బకాయిలు ఉన్న వారికి జీఎస్టీ నోటీసులు ఇవ్వకూడదని కౌన్సిల్ ప్రతిపాదించింది. ప్రస్తుతం మొత్తం కేసుల్లో ఇ లాంటి కేసులే 20 శాతం వరకు ఉంటున్నాయి. పైగా చిన్నమొత్తానికి కూడా నోటీసులు ఇవ్వడంతో పన్ను చెల్లింపుదారులు, వ్యాపారులు భయపడుతున్నారని.. వారికి ఊరటకలిగించేలా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. 

ఈ-చిరువ్యాపారులకు ప్రోత్సాహం

ఈకామర్స్ వేదికగా అమ్మకాలు చేపట్టాలనుకునే చిన్నవ్యాపారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ను సులభతరం చేయాలని కౌన్సిల్ నిర్ణయించింది. సొంతగా వ్యాపార సెంటర్లు లేని వారికి ఈథై సంస్థల గోదాములను కూడా తమ వ్యాపార కేంద్రాలు వాడు కునే వెసులుబాటు కల్పించాలని ప్రతిపాదించింది. ఒక రాష్ట్రంలో ఈథై వేదికలో ఫిజికల్ వెరిఫికేషన్, ఆధార్ ధ్రువీకరణతో నమోదు చేసుకున్న చిన్నవ్యాపారులు.. ఇతర రాష్ట్రాల్లో నేరుగా ఈకామర్స్ నుంచి అనుమతి పొంది తమ అమ్మకాలను చేపట్టుకోవచ్చు. ఇతర రాష్ట్రాల ట్యాక్స్ ఆఫీసర్ల జో క్యం అవసరం ఉండదు. దీంతో 9.5 లక్షల మంది చిన్నవ్యాపారులు దేశవ్యాప్తంగా తమ అమ్మకాలు చేపట్టుకొనే వెసులుబాటు లభిస్తుందని  కౌన్సిల్ అంచనా వేసింది. 

ఉద్యోగుల బీమాపై కంపెనీలకు ఐటీసీ

ఉద్యోగులకు లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ కో సం కంపెనీలు చెల్లించే ప్రీమియంపై ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) పొందే అవకా శాన్ని జీఎస్టీ కౌన్సి ల్ పరిశీలించింది. ప్రస్తుతం ఉద్యోగుల బీమాపై కంపెనీలు 18 శాతం జీఎస్టీ చెల్లిస్తుండగా.. దానిపై ఐటీసీ పొందే అవకాశం కంపెనీలకు దక్కుతుంది. 

వివాదాల పరిష్కారానికి ఉమ్మడి రూల్స్

జీఎస్టీ వివాదాల పరిష్కారానికి దేశవ్యాప్తం గా ఉమ్మడి నిబంధనలు తీసుకురావాల ని కౌన్సిల్ నిర్ణయించింది. పన్ను నోటీసులు ఎట్లా పంపాలి? ప్రాథమిక సమాచారం ఎ లా అందించాలి, మోసాలను ఎలాంటి సమయంలో ఆపా దించాలి, విచారణలు ఎలా కొనసాగించాలి అనే వాటిపై త్వరలోనే గైడ్‌లైన్స్ రూపొందించనున్నారు. రిటర్న్‌లు ఆలస్యంగా దాఖలు చేసినా, చెల్లింపుల్లో చిన్నచిన్న పొరపాట్లు జరిగినా.. రావాల్సిన సొమ్ము, వడ్డీ, అతితక్కువ జరిమానా మాత్రమే వసూలు చేస్తారని, కఠిన క్రిమినల్ చర్యలు ఉండబోవని కౌన్సిల్ స్పష్టం చేసింది.

గతంలో జీఎస్టీ చట్టం తెచ్చినప్పుడు సరై న సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదని, దాని వల్ల ఎగవేతదారులను భయపెట్టేందుకు పలు నిబంధనలు తేవాల్సి వచ్చిం దని.. ఇప్పుడు ఏఐ సహా విస్తృత స్థాయిలో టెక్నాలజీ అందుబాటులో ఉందని, లావాదేవీల్లో లొసగులను ఇట్టే గుర్తించొచ్చని, అం దుకే పాత రూల్స్ తొలగించినట్లు కౌన్సిల్ తెలిపింది. 

సంస్కరణల కోసం అధికారులతో కమిటీ

నిజాయితీ పరులైన పన్ను చెల్లింపుదారులకు రక్షణ కల్పించేందుకు సంస్కరణలు చేపట్టాలని జీఎస్టీ కౌన్సిల్ భేటీలో నిర్ణయించారు. ఇందుకోసం అధ్యయనానికి అధికా రులతో కమిటీ వేయాలని, ఈ కమిటీ మూ డు నెలల్లో నివేదిక ఇస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. తదుపరి సమావేశంలో దీనిపై ఫైనల్ నిర్ణ యం తీసుకుంటామని ఆమె చెప్పారు. కా గా, యూపీఏ పేమెంట్ల ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) చార్జీల అంశం కౌన్సిల్ సమావేశంలో చర్చకు రాలేదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు