మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి

09-10-2026 | 01:00pm

బోథ్,(విజయక్రాంతి): మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మండల నాయకులు తాసిల్దార్ సుభాష్ చంద్ర(Tahsildar Subhash Chandra)కు వినతి పత్రం అందించారు. వర్ష బావపరిస్థితుల వల్ల పంటలు ఎండిపోతున్నాయని పేర్కొంటున్నారు. అంతేగాక భవిష్యత్తులో త్రాగునీటికి ఇబ్బందులు తలెత్తి ఆస్కారం ఉందని వాపోతున్నారు.

కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, ఆత్మ మాజీ అధ్యక్షులు మల్లెపూల సుభాష్, బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు అల్లకొండ ప్రశాంత్, సహకార సంఘం డైరెక్టర్ ధ్యాగల నారాయణ తోపాటు పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు. సమస్యను వివరిస్తూ తాసిల్దార్ వినతి పత్రం అందించారు.

మరిన్ని వార్తలు