సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

09-10-2026 | 01:18pm

మాట నిలబెట్టుకున్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క

జైనూర్,(విజయక్రాంతి): ఇచ్చిన హామీ మేరకు కర్ణంగూడ గ్రామం(Karnanguda Village)లో సీసీ రోడ్డు నిర్మాణానికి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క(DCC President Atrram Sugunakka) కృషి చేశారు. దీంతో గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులను గ్రామ పెద్దలు పూజలు నిర్వహించి ప్రారంభించారు. రోడ్డు పనులు ప్రారంభం కావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ, గ్రామ అభివృద్ధికి సహకరించిన ఆత్రం సుగుణక్కకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు గేడం గోపీచంద్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు దండుగుల మహేష్, గ్రామ పటేల్ గేడం చందు పటేల్, దేవరి కుమ్రా బీంరావ్, పెందోర్ చిన్ను, కాంగ్రెస్ యువ నాయకుడు గేడం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు