క్రీడలతో మానసిక ఉల్లాసం

09-10-2026 | 01:07pm

మాజీ జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): చదువుతో పాటు క్రీడల్లోనూ యువత రాణించాలని మాజీ జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు(Former ZP Chairman Koneru Krishna Rao) అన్నారు. దహెగాం మండలం కొంచవెల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప(Former MLA Koneru Konappa) సహకారంతో కొంచవెల్లి యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం కలగడంతో పాటు యువత మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాసం శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కోనేరు అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు