పిడుగులాంటి విషాదం.. కరెంట్ షాక్‌తో రైతు మృతి!
09-10-2026 | 12:52pm
పొలం బాట పట్టిన రైతును బలిగొన్న విద్యుత్ ప్రమాదం
అక్కన్నపేట శివారులో విషాదఛాయలు
రామాయంపేట,(విజయ క్రాంతి): పంటను చూసుకోవాలనే ఆశతో పొలానికి వెళ్లిన రైతు.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. వ్యవసాయ పనుల(Agricultural activities) కోసం వెళ్లిన అన్నదాతను కిందపడిన విద్యుత్ తీగ రూపంలో మృత్యువు కబళించింది. రామాయంపేట మండలం(Ramayampet mandal) అక్కన్నపేట గ్రామ శివారులో సార్గ్ శ్రీనివాస్ అనే రైతు విద్యుత్ షాక్(Electric shock)కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. రైతు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.