తెగిపడ్డ విద్యుత్ తీగ.. పట్టించుకోని అధికారులు

09-10-2026 | 12:57pm

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలోని చింతల బోరి గ్రామంChintala Bori Village)లో శుక్రవారం 11 గంటల ప్రాంతంలో విద్యుత్ తీగ కిందపడిపోయింది(Broken electric wire). దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరా కు అంతరాయం కలిగింది. మరోవైపు విద్యుత్ తీగ తెగిపడడంతో పొలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని గ్రామానికి చెందిన రైతు రవికిరణ్ వాపోయారు.

గురువారం విద్యుత్ తీగ తెగిపడడంతో గ్రామస్తులు అతికించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించుకున్నారు. అయితే శుక్రవారం సైతం తెగిపడిందని దీంతో సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు తెలిపిన పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అన్నారు. అధికారులు తక్షణమే విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు