దాడిని ఖండించిన బార్

05-10-2026 | 03:30pm

చేర్యాల బార్ అసోసియేషన్

చేర్యాల,(విజయక్రాంతి): చేర్యాల కోర్టు(Cheryala Court) పరిధిలో న్యాయవాది గూడెపు శ్రీధర్ పై జరిగిన దాడిని చేర్యాల బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. దాడికి నిరసనగా కోర్టు విధులను బహిష్కరించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్(Cheryala Bar Association) అధ్యక్షుడు ఆరెళ్ల వీరమల్లయ్య మాట్లాడుతూ న్యాయవాది గూడెపు శ్రీధర్ ఇంటిపై దుండగులు దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేసి, ఆస్తి నష్టం కలిగించి చంపేందుకు యత్నించారని ఆరోపించారు.

దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మెరుగు రమేష్, సీనియర్ న్యాయవాదులు భూమిగారి మనోహర్, పొన్నం సురేష్, నల్గొండ సంతోష్, తాటికొండ ప్రణీత్, గుస్క వెంకటేష్, పర్వతం రాములు, మోకు రాజిరెడ్డి, నీరటి రాజలింగం, దర్శనం ప్రశాంత్, అంకణి సురేందర్, బైరగోని ప్రసాద్, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు