అలుగులో అంగన్వాడీ మెడిసిన్
వైద్యారోగ్యశాఖ మెడిసినుతో పాటు అంగన్వాడీ మెడిసినుగా గుర్తింపు
బిజినేపల్లి: గాంధీ జయంతి(Gandhi Jayanti) రోజున పాలెం చెరువు అలుగు(Palem Cheruvu Alugu)లో వెలుగు చూసిన వైద్యారోగ్యశాఖ మెడిసినుతో పాటు అంగన్వాడీ కేంద్రానికి చెందిన మెడిసిన్ కూడా ఉన్నట్లు తెలిసింది. వైద్యారోగ్యశాఖ(Department of Medical and Health) మెడిసిన్ కాలం చెల్లిన మెడిసినుగా గుర్తించగా, అంగన్వాడీ కేంద్రానికి చెందిన మెడిసిన్ 2027 మార్చ్ వరకు చెల్లుబాటులో ఉందని అధికారులు గుర్తించారు. ఇప్పటికే వైద్యారోగ్య శాఖలో పని చేసే ఏఎన్ఎం విజయకు ఆ రోజే మేమో జారీ చేశారు. అంగన్వాడీ కేంద్రానికి చెందిన మెడిసిన్ పట్ల నీర్లక్ష్యంగా ఎవరు వ్యవహరించారనేది తేలాల్సి ఉంది. ఈ విషయంలో అధికారులు విచారణ చేస్తారా లేక వదిలేస్తారా ఆ శాఖల్లో పని చేసే సిబ్బంది గుసగుసలాడుతూన్నారు.