విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

05-10-2026 | 04:19pm

కల్వకుర్తి: ఊరుకొండ మండల పరిధిలోని రాచాలపల్లి శివారులో విషాద ఘటన సోమవారం చోటుచేసుకుంది. కేఎల్‌ఐ కాల్వ(KLI canal)లో మోటార్‌ మరమ్మతులు చేస్తుండగా విద్యుత్‌ షాక్‌(Electric Shock)కు గురై తిమ్మన్నపల్లి గ్రామానికి చెందిన  శ్యామ్‌ (39) అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు.

మోటార్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో శ్యామ్‌ దానిని సరిచేసేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ సరఫరా కావడంతో షాక్‌కు గురయ్యాడు. సమీపంలోని రైతులు గమనించి వెంటనే అతడిని బయటకు తీసి చూడగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు శ్యామ్‌కు భార్యతో పాటు నలుగురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన శ్యామ్‌ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు