ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
05-10-2026 | 04:05pm
బెజ్జంకి,(విజయక్రాంతి): బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం పోషణ మాసం కార్యక్రమం(Nutrition Month Event) నిర్వహించారు. ముఖ్య అతిథిగా సర్పంచ్ ఎర్రల జానకిరాజు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు పోషకాహారం తీసుకోవడంతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సర్పంచ్ సూచించారు. అనంతరం ఏ ఎన్ ఎం రాధ, అంగన్వాడీ టీచర్ శారద పోషకాహారం, ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ చింతలపల్లి పద్మ, ఉపాధ్యాయులు, ఆయా కనకవ్వ, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.