రోడ్డు అలైన్మెంట్ను మార్చాలని బీజేపీ ధర్నా
పోలీస్ జోక్యం తో విరమణ
కోహెడ, నవంబర్ 27: కోహెడ మండలం నాగ సముద్రాలలోని తెలంగాణ మోడల్ స్కూల్ మైదానం(Telangana Model School Playground) నుంచి రహదారి నిర్మించేలా రూపొందించిన అలైన్మెంట్ను వెంటనే మార్చాలని డిమాండ్ చేస్తూ.. శుక్రవారం బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్బంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వెంకటేశం మాట్లాడుతూ.. సుమారు 800 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్న.. మోడల్ స్కూల్ ప్రాంగణాన్ని రెండుగా విభజిస్తూ రోడ్డు అలైన్మెంట్ రూపొందించడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. రోడ్డు అలైన్మెంట్ ద్వారా పాఠశాల రెండు ముక్కలుగా ఏర్పాటు అవుతుందని దింతో విద్యార్థులకు విద్యాబ్యాసం పట్ల తీవ్ర అంతరాయం కలుగనుందాన్నారు.
సర్వే నంబర్ 263.లో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ప్రహరీ గోడతో పాఠశాల నిర్మాణం పూర్తయిందాన్నారు. పాఠశాల వద్ద మూడుసార్లు అలైన్మెంట్ ఎందుకు మార్చారని ప్రశ్నించారు. ఎల్కతుర్తి నుంచి సంగారెడ్డి వరకు నిర్మిస్తున్న ప్రధాన రహదారిలో ఇతర ప్రాంతాల్లో లేని విధంగా నాగసముద్రాల మోడల్ స్కూల్ వద్ద మాత్రమే యస్ ఆకారంలో అలైన్మెంట్ రూపొందించడం వెనుక ఉన్న ఆంతర్యం పై మండిపడ్డారు.
పాఠశాలకు చెందిన బ్యాంక్ అకౌంట్ రూ. 62 లక్షలు జమ ఐన విషయం విద్యా కమిటీ ప్రతినిధులకు సంబందిత ప్రిన్సిపాల్ తెలుపక పోవడం సరికాదన్నారు. గతం లో కూడ రూ. 2 కోట్లు వినియోగంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు లేకపోలేదన్నారు. పాఠశాల స్థలాన్ని కాపాడేందుకు విద్యార్థుల లలిసి పోరాటంలో భాగస్వామవుతామని స్పష్టం చేశారు.