బొమ్మనపల్లిలో బాలా బాపూ ఆలయ వార్షికోత్సవం ఘనంగా
భారీగా తరలివచ్చిన బంజారా భక్తులు, సాధువులు..
భోగభండారో నైవేద్య సమర్పణ
టేకులపల్లి, (విజయక్రాంతి): మండలంలోని బొమ్మనపల్లి గ్రామం(Bommanapalli Village) సాయమ్మ చెరువు సమీపంలో స్వయంభూగా వెలసిన శ్రీ బాలా బాపూ ఆలయ(Sri Bala Bapu Temple) 15వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ కమిటీ చైర్మన్ వి. హాథీరామ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా భోగభండారో నైవేద్య సమర్పణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో(devotional) నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాల నుంచి బంజారా భక్తులు(devotee), సాధువులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. బాలా బాపూ స్వామివారు కోరిన కోరికలు తీర్చే దైవంగా భక్తుల(devotee) విశ్వాసమని, సంతానం లేని మహిళలు స్వామివారిని మొక్కుకుంటే సంతానం కలుగుతుందని, భక్తితో ప్రార్థిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయని భక్తులు(devotee) తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో సాధువులు లక్ష్మా సాధువు, సేవా సాధువుతో పాటు గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈ. లక్ష్మణ్ నాయక్, లంబాడా హక్కుల పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు గూగులోత్ రాజేష్ నాయక్, బీజేపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు బానోతు విజయలక్ష్మి, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు రమేష్ నాయక్, టీజీటీజీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూక్యా రవి, సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ నాయక్, టీజీటీజీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వి. రమేష్ బాబు, కాంగ్రెస్ నాయకుడు అజ్మీరా శంకర్, సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీను నాయక్, జిల్లా అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్, సీపీఐ జిల్లా నాయకుడు ఉపేందర్ నాయక్, కొత్తండ సర్పంచ్ తారాచంద్, తండా నాయకులు రత్నా నాయక్, జంకీలాల్ నాయక్, బాలాజీ నాయక్, శివలాల్, పార్వతి తదితరులు పాల్గొన్నారు. భక్తులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆలయ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.