ఆర్టీసీ ప్రయాణికుల కోసం ప్రత్యేక ఎంక్వైరీ నంబర్

09-10-2026 | 12:04pm

ఆసిఫాబాద్(విజయక్రాంతి): ప్రయాణికులకు బస్సుల వేళలు, సర్వీసుల వివరాలు, రిజర్వేషన్ సమాచారం అందించేందుకు ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపో(Asifabad RTC Depot) ఆధ్వర్యంలో ప్రత్యేక ఎంక్వైరీ ఫోన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు డిపో మేనేజర్ కే వి రాజశేఖర్(Depot Manager K.V. Rajashekhar) తెలిపారు. ప్రయాణికులు 9493282510 నంబర్‌కు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా, సురక్షితమైన ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని కోరారు. “ప్రైవేటు వాహనాల ప్రయాణం వద్దు.. ఆర్టీసీ బస్సు ప్రయాణం ముద్దు” అని సూచించారు.

మరిన్ని వార్తలు