రైతు గర్జన సభను విజయవంతం

12-11-2026 | 08:08pm

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్‌ జిల్లా కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్‌(BRS) పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు గర్జన మహాసభకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బీఆర్ఎస్‌ నిర్మల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి రామ్‌ కిషన్‌రెడ్డి(Ram Kishan Reddythanks) పేర్కొన్నారు. రైతు గర్జన సభకు రైతులు, యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సంఘీభావాన్ని తెలియజేశారని తెలిపారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(BRS Working President KTR) చేసిన ప్రసంగాన్ని సభకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆద్యంతం ఆసక్తిగా ఆలకించారని పేర్కొన్నారు.

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి హక్కుల పరిరక్షణ, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై కేటీఆర్‌ వివరించిన విషయాలకు సభలో మంచి స్పందన లభించిందన్నారు. రైతు గర్జన సభ విజయవంతం కావడానికి కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు, యువతతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సభకు తరలివచ్చిన ప్రజల స్పందన పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని రామ్‌ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు