ప్రజా విధానాల ఫలితాలపై శాస్త్రీయ మూల్యాంకనం అవసరం

23-11-2026 | 06:07pm

గీతం కౌటిల్య స్కూల్‌లో డాక్టర్ ఫ్రాన్సిస్ జేవియర్ రత్నం ఉపన్యాసం

పటాన్ చెరు, నవంబర్ 23: ప్రజా విధానాల ప్రభావాన్ని అంచనా వేయడానికి శాస్త్రీయ పరిశోధన, ప్రయోగాత్మక మూల్యాంకన పద్ధతులు కీలకమని డాక్టర్ ఫ్రాన్సిస్ జేవియర్ రత్నం(Dr Francis Xavier Ratnam) అన్నారు. గీతం విశ్వవిద్యాలయంలోని కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన అతిథి ఉపన్యాసంలో ఆయన మాట్లాడారు.

ప్రభుత్వ పథకాల ఫలితాలను విశ్లేషించడం, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడం, సమర్థవంతమైన విధానాల రూపకల్పనకు పరిశోధన ఆధారాలు దోహదపడతాయని పేర్కొన్నారు. యాదృచ్ఛిక నియంత్రిత పరీక్షల (RCTs) ద్వారా పథకాల ప్రభావాన్ని శాస్త్రీయంగా అంచనా వేయవచ్చని వివరించారు. విద్య, పాలన, ప్రజాసేవల్లో ఆధారిత విధానాల ప్రాధాన్యతను వివరించారు.

మరిన్ని వార్తలు