పర్యవేక్షణ పడకేసింది.. పాలన గాడి తప్పింది..!

14-11-2026 | 05:05am
  1. కళ తప్పుతున్న మండల సమీక్ష సమావేశాలు   
  2. అధికారుల ఇష్టారాజ్యం
  3. డిప్యుటేషన్ల పేరుతో సర్కారు బడుల్లో కుంటుపడుతున్న చదువులు
  4. హెచ్‌ఎండీఏ పనుల్లో నాణ్యతకు పాతర
  5. సర్పంచుల మాట చెల్లని వైనం

రంగారెడ్డి బ్యూరో, నవంబర్ 13 (విజయక్రాంతి): గ్రామీణాభివృద్ధికి దిక్సూచిగా, ప్రజా సమస్యల పరిష్కార వేదికలుగా నిలవాల్సిన మండల సమీక్ష సమావేశాలు నేడు ఉత్సవ విగ్రహాలుగా మారాయి. స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ముగియడం, కొత్త ఎన్నికలు ఆలస్యం కావడంతో రంగారెడ్డి(Rangareddy) జిల్లాలో క్షేత్రస్థాయి పాలన పూర్తిగా గాడి తప్పింది. అధికారులపై అజమాయిషీ లేకపోవడంతో ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, షాద్నగర్, చేవెళ్ల, మహేశ్వరం నియోజకవర్గాల్లో ’ఆడిందే ఆట.. పాడిందే పాట’ అన్న చందంగా పరిస్థితి తయారైంది.

ప్రస్తుతం ప్రత్యేక అధికారుల సమక్షంలో  నామమాత్రంగా సమా వేశాలు కొనసాగుతున్నాయి. గతంలో మూడు నెలలకోసారి జరిగే మం డల సర్వసభ్య సమావేశాల్లో గ్రామాల్లో మౌలిక వసతి సౌకర్యాలు  రోడ్లు, తాగునీరు, సాగునీరు, పారిశుధ్యం, విద్య, వైద్యం, రెవె న్యూ (ధరణి) సమస్యలపై అధికారులను నిలదీసేవారు. కానీ, ప్రస్తుతం ఎంపీపీలు, జడ్పీటీసీలు లేకపోవడంతో సమావేశాలు ’గుడిలో దేవుడు లేని’ చందంగా మమ అనిపిస్తున్నారు. రికార్డుల రాతలకే పరిమితమవు తున్న ఈ సభల్లో తమ గ్రామ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రతిపక్ష సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డిప్యుటేషన్ల రగడ.. సర్కారు బడుల్లో చదువులు ఆగం..

విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లో పంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో బోధన అస్తవ్యస్తంగా మారింది. జిల్లా లో మచ్చుకు కొన్ని మండలాల్లో ఆమనగల్లు మండలంలోని శెట్టిపల్లి, కడ్తాల్ మండలం సరికొండ, తలకొండపల్లి మండలం చుక్కాపూర్తో పాటు పలు గ్రా మాల్లోఉపాధ్యాయుల ను డిప్యూటేషన్లపై ఇత ర చోట్లకు పంపారు. దీంతో ఉన్నత పాఠశాలల్లో కీలక సబ్జెక్టులు చె ప్పేవారు లేక, ప్రాథమిక పా ఠశాలలు ఏకోపాధ్యాయ బడులుగా మారి పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది.

గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీల సి పార్స్ లెటర్లతో డిప్యూటేషన్ వెళ్లిన పలువు రు ఉపాధ్యాయులు తక్షణమే తమకు కేటాయించిన పాఠశాలలో తిరిగి రావాలని  జిల్లా డిఈఓ నుంచి ఆదేశాలు వెళ్లిన... కొం దరు ఉపాధ్యాయులు ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చిప్స్టేషన్లో కదలని పలువురు ఉపాధ్యాయులకు  జిల్లా డీఈవో షోకాజు నోటీసులు జారీ చేసిన  లెక్కచేయ డం లేదని ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి.

హెచ్‌ఎండీఏ నిధులకు తూట్లు.. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం..

జిల్లాలో కోట్లాది రూపాయల హెచ్‌ఎండీఏ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు గాలికొదిలేశారు. క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాల్సిన ఇంజ నీరింగ్ అధికారులు (ఏఈలు, డీఈలు) కనీసం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. నాణ్యత పాటించాలని స్థానిక సర్పంచులు సూచిస్తున్నా, కాంట్రాక్టర్లు వారిని లెక్కచేయకుండా నాసిరకం పనులతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు.

కలెక్టర్ స్పందించాలి..

మండల స్థాయిలో శాఖల అధికారుల మధ్య సమన్వయం లేక సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి గ్రా మాల్లో మౌలిక సమస్యలు పరిష్కరించడంతోపాటుగా, పాఠశాలల్లో డిప్యూటేషన్లను రద్దు చేయాలని, హెచ్‌ఎండీఏ పనుల నాణ్యతపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

జిల్లా కలెక్టర్ సైతం ఇటీవల పలు సమావేశాల్లో జిల్లా స్థాయి అధికారులు అంతా ఫీల్ విజిట్ చేయాలని ఆదేశాల సైతం జారీ చేశారు.అయితే జిల్లాలో కొన్ని శాఖల అధికారులు తప్ప మిగతా శాఖల అధికారులు కలెక్టర్ కార్యాలయం నుంచి కదలడం లేదని ఆరోపణలు సైతం ఉన్నా యి. చూడాలి మరి ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో  పర్యటనలు చేసి  ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతారో  లేదో వేచి చూడక తప్పదు మరి.

మరిన్ని వార్తలు