షెహరంత అదిరిపోని..
బాలకృష్ణ(Balakrishna) హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దాదా’. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కి స్తున్న ఈ చిత్రానికి వెంకట సతీశ్ కిలారు నిర్మాత. మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ‘దాదా ధమాకా’ను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. పబ్ బ్యాక్‌డ్రాప్‌లో బాల కృష్ణ, బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ ఈ పాట స్టెప్పులేశారు.
‘షెహరంత అదిరిపోని.. నిదరంత చెదిరిపోనీ.. జామురాతిరి జాగా రం చెయ్యనీ పరువాన్నీ.. దిల్ మంట రగిలిపోని.. వయసంత మరిగి పోనీ.. మందుమత్తుకీ అందమే కమ్మనీ బిర్యానీ.. నువ్ గమ్మునుంటం నచ్చలే నచ్చలే.. ఆజా నాతో నాచ్‌లే నాచ్‌లే.. ఆటపాట తాట తీద్దాం.. వద్దు అంటే ఒప్పుకోను అస్సలే..’ అంటూ సాగుతోందీ గీతం. తమన్ స్వరపర్చిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, రజిని శ్రీ పూర్ణిమ పాడారు. బాలకృష్ణ కూడా కొంత భాగా న్ని పాడటం మరో ప్రత్యేకత. డిసెంబర్ 24న విడుదల కానున్న ఈ చిత్రానికి డీవోపీ: అరవింద్ ఎస్ కశ్యప్ ఐఎస్‌సీ; సంగీతం: తమన్; డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా; ఫైట్స్: రామ్-లక్ష్మణ్, రవివర్మ, వీ వెంకట్; ఎడిటర్: నవీన్ నూలి; ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాశ్.