ప్రముఖ నటుడికి తీవ్ర గాయాలు
ఐదు పక్కటెముకలు విరిగి.. ఐసీయూలో చికిత్స.. ఇంటికి చేరిన టిన్ను ఆనంద్!
ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు Tinnu Anand Health Update ప్రస్తుతం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. తీవ్ర గాయాలతో ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. Tinnu Anand Discharged కావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే పూర్తిగా కోలుకునే వరకు వైద్యులు కఠినమైన Bed Rest సూచించారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో టిన్ను ఆనంద్‌కు ఐదు పక్కటెముకలు విరిగినట్లు సమాచారం. వాటిలో ఒకటి ఊపిరితిత్తులకు గుచ్చుకోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని తెలుస్తోంది. దీంతో వైద్యులు Tinnu Anand ICU Treatment అందించారు. పరిస్థితి మెరుగుపడటంతో ఆస్పత్రి నుంచి ఇంటికి పంపించారు.
ఇంకా తగ్గని నొప్పి.. ఇంట్లోనే చికిత్స
ప్రస్తుతం Tinnu Anand Rib Injury నుంచి కోలుకునేందుకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యుల సూచనలతో ఇంటి వద్దే Physiotherapy చేయించుకుంటున్నారు. కూర్చున్నా, పడుకున్నా, శరీరాన్ని పక్కకు తిప్పుకున్నా నొప్పి వేధిస్తోందట. మంచం మీద నుంచి లేవడం, కూర్చోవడం కూడా ఇబ్బందిగా మారిందని సమాచారం. మాట్లాడేటప్పుడు సైతం అసౌకర్యం కలుగుతోందట. అయితే ఆయనకు గాయాలు ఎలా తగిలాయనే విషయం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
పెండింగ్ సినిమాల డబ్బింగ్ ఎప్పుడు?
మరోవైపు టిన్ను ఆనంద్‌తో పెండింగ్‌లో ఉన్న సినిమాల Dubbing పనులు పూర్తి చేయించేందుకు కొందరు నిర్మాతలు సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిలో ఆయన ఎప్పుడు తిరిగి పని ప్రారంభిస్తారనే దానిపై స్పష్టత లేదు. దీంతో ఆయన నటిస్తున్న సినిమాల పనులు ఎప్పుడు పూర్తవుతాయనే ఆసక్తి నెలకొంది. Tinnu Anand Movies విషయానికి వస్తే.. ఆయన అసలు పేరు వీరేంద్ర రాజ్ ఆనంద్. ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రేతో ఐదేళ్ల పాటు పనిచేసిన తర్వాత దర్శకత్వ రంగంలోకి అడుగుపెట్టారు. అమితాబ్ బచ్చన్‌తో కలిసి చేసిన కాలియా, షహెన్షా, మై ఆజాద్ హూన్, మేజర్ సాబ్ చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చాయి. Tinnu Anand Telugu Movies విషయానికి వస్తే ఆదిత్య 369, ఘటోత్కచుడు, అంజి వంటి సినిమాల్లో నటించారు. ఇటీవలి కాలంలో సాహో, సీతారామం, సలార్, లక్కీ భాస్కర్ చిత్రాలతో పాటు పెద్ది సినిమాలోనూ కనిపించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరగా కోలుకుని తిరిగి సినిమాల్లోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు.