గిరిజన తండాలపై క్రషర్ల పడగ
- దుమ్ము, బ్లాస్టింగ్లతో తండాల్లో ఉండలేకపోతున్న గిరిజనులు
- అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వ్యాపారుల ఇష్టారాజ్యం
- బ్లాస్టింగ్‌తో వ్యవసాయానికి దూరమవుతున్న గిరిజన రైతులు
మేడ్చల్, నవంబర్ 13 (విజయక్రాంతి): మేడ్చల్ సిద్దిపేట జిల్లాల సరిహద్దులో ఉన్న మూడు తండాల గిరిజనులకు కంకర క్రషర్ల(Crushers) వల్ల కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఒక వైపు దుమ్ము, మరో వైపు 24 గంటలు బ్లాస్టింగ్, ఇంకొక వైపు భారీ టిప్పర్లు తిరుగుతుండడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ఫిర్యాదు చేసే వారు, అడిగే వాడు లేకపోవడం, శివారుల్లో ఉండటంతో వారి రోదన క్రషర్ల రాళ్ళను దాటి బాహ్యప్రపంచానికి తెలియడం లేదు. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో గూడెం గడ్డ తండా, దొంగల గుట్ట తండా, కాసింబాయి తండా గిరిజనులు సమీపంలోని క్రషర్ల వల్ల పడుతున్న బాధలు వర్ణనాతీతం. రెండు క్రషర్ల లు మూడు తండాల సమీపంలో ఏర్పాటు కావడంతో వారి జీవన విధానంపై దెబ్బపడింది. రేయింబవళ్లు బ్లాస్టింగ్లు చేయడంతో శబ్దం, దుమ్ముతో గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు.
పేలుళ్ల సమయంలోనే కాక, కం కర మిషన్లు నడిచే సమయంలో దుమ్ము లేచి గిరిజన తండాలపై పడుతోంది. దీంతో గిరిజనులు బయట కూర్చుని ఆహారం తినలేక పోతున్నారు. అన్నిటిపై దుమ్ము పేరుకు పోతోంది. రాత్రి పగలు అని తేడా లేకుండా టిప్పర్లు తిరుగుతున్నాయి. రాత్రి సమయం లో టిప్పర్లతోపాటు, పేలుల శబ్దం వల్ల కంటి నిండా కునుకు లేకుండా పోతోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దు మ్ము పంట పొలాల మీద పడడంతో పంట నష్టం జరుగుతోందని, పేలుళ్ల వల్ల బోరు బావులు ఎండిపోతున్నాయని తెలిపారు. ఈ క్రషర్ల వల్ల తమ జీవనాధారమైన వ్యవసాయాన్ని చేసుకోలేకపోతున్నారు. వాయు కాలుష్యం వల్ల శ్వాస కోశ వ్యాధులు వస్తున్నాయి.
గిరిజనుల భూముల్లో మైనింగ్..
క్రషర్ల యజమానులు గిరిజనుల భూముల్లో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వారికి కేటాయించిన దాని కంటే ఎక్కువగా విస్తీర్ణంలో గిరిజనుల భూములను అక్రమంగా తీసుకొని మైనింగ్ చేస్తున్నట్లు గిరిజనుల ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి కంటే ఎక్కువగా తవ్వి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు.
అధికారుల పర్యవేక్షణ కరువు..
అధికారుల పర్యవేక్షణ లేనందున క్రషర్ల యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. క్రషర్లు నిబంధనల మేరకు నడు స్తున్నాయా లేదా అనేది చూడడం లేదని తెలిపారు. అంతేగాక దుమ్ము ధూళితో, బ్లాస్టింగ్లతో ఇబ్బంది పడుతున్నప్పటికీ కాలు ష్య నియంత్రణ అధికారులు పట్టించుకోవడంలేదని గిరిజనులు వాపోతున్నారు. ఇప్ప టికైనా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరు తున్నారు.
తండాల్లో ఉండలేకపోతున్నాం..
క్రషర్ల నుంచి వచ్చే దుమ్ము వల్ల తండాలలో ఉండలేకపోతు న్నాం. ఇళ్లలోకి కూడా దుమ్ము వస్తోంది. ఆ హార పదార్థాల గిన్నెల మూతలు తెరిచి ఉంటే అందులో పడుతోంది. రాత్రి పగ లు టిప్పర్ల చప్పుడు ఉంటుంది. బ్లాస్టిం గులు కూడా చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి.
వీరేష్ నాయక్
రాళ్లు పొలాల్లో పడుతున్నాయి..
బ్లాస్టింగ్ వల్ల రాళ్లు ఎగిరి వచ్చి పొలాల్లో పడుతున్నాయి. దుమ్ము పొలాల్లో పం టల మీద పడుతుం ది. దీంతో పంటలు ఎదగడం లేదు. వ్యవసాయం మానేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు గిరిజనుల గోసను అర్థం చేసుకోవాలి.
రాములు నాయక్