వ్యవసాయ పనుల్లో డ్రోన్ల వాడకం ద్వారా రైతులకు లాభాలు
కాగజ్నగర్, అక్టోబర్ 17 ( విజయక్రాంతి) : శాస్త్ర సాంకేతిక రంగాల్లో(Field of Science and Technology) దేశం అభివృద్ధి చెందుతున్న తరుణంలో రైతులు వ్యవసాయంలో(Farmers and Agriculture) పంటల సంరక్షణకు పిచ్చి కారి మందులను డ్రోన్ల(Drones) ద్వారా స్ప్రే చేసినట్లయితే రైతులకు డబ్బుతో పాటు సమయం చాలా ఆదావుతుందని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు(MLA Harish Babu) అన్నారు. శనివారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని ఈస్ గాం గ్రామపంచాయతీలో గల రైతులకు సంబంధించిన వరి, పత్తి పంట చేనులలో డ్రోన్ ద్వారా పిచ్చి కారి మందులను స్ప్రే చేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం పంట దిగుబడి సాధించేందుకు ప్రభుత్వం రు. 10 లక్షల వ్యయం గల డ్రోన్ ను రైతులకు అందించినట్లు తెలిపారు. కేవలం ఎకరాకు రు. 3 వందల ఖర్చుతో పంటల్లో పురుగుల నివారణ కోసం స్ప్రే మందులను చల్లవచ్చని అన్నారు. వ్యవసాయ పనులకు కూలీల కొరత ఉన్న తరుణంలో ఈ డ్రోన్ల వాడకం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో ఇస్గాం సర్పంచ్ అగ్గిల సంగీత, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి, మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ, రైతుల పాల్గొన్నారు.