నిరుపేద విశ్వబ్రాహ్మణ కుటుంబాన్ని ఆదుకోవాలి
మతిస్థిమ్మితం లేక అవస్థలు
చందుర్తి,అక్టోబర్ 01,(విజయక్రాంతి): మండలంలోని మూడపల్లి గ్రామంలో స్మశాన వాటికలో నివాసముంటున్న నిరుపేద నర్సయ్య కుటుంబాన్ని జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పరామర్శించారు,వారి కుటుంబానికి ప్రభుత్వం చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు, ఇల్లు లేక తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతూ అనారోగ్యంతో బాధపడుతు, మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించేందుకు గ్రామ సర్పంచ్ చొరవ చూపాలని అన్నారు .
దీనావస్థలో ఉన్న నరసయ్య కుటుంబానికి తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు. స్మశాన వాటికలో నివాసం ఉండడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లేశ్వరి అంజిబాబు, కొలనూరు శంకర్, బోగోజి ఆంజనేయులు,చందనం రఘుపతి,జిల్లా నాయకులు దర్శనాల శంకర్, కొత్తపల్లి శ్రీనివాస్, తిరుమల చారి, నాగరాజు, సుద్దాల చంద్రయ్య, మండల నాయకులు రాజూరి రవి, దేశరాజు ఆంజనేయులు, ఇల్లందుల తిరుపతి, రామచంద్రం, తదితరులు పాల్గొన్నారు.