అలరించిన స్వాగతోత్సవం

01-10-2026 | 08:28pm

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని కాలేజీ రోడ్డులో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల(Government Junior College)లో గురు వారం స్వాగతోత్సవాన్ని నిర్వహించారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు, మొదటి సంవత్సరం విద్యార్థులను స్వాగతిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి(District Intermediate Education Officer) కె. అంజయ్య హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నతమైన స్థాయిలో నిలవాలని సూచించారు.

విద్యార్థులకు అల్పాహారం, భోజనం అందిస్తూ ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫామ్, ఇతర వస్తువులను ప్రభుత్వం అందజేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ, తిరిగి ప్రభుత్వానికి ఉత్తమ ఫలితాలు బహుమతిగా ఇవ్వాలని విద్యార్థులకు సూచన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం అలరించాయి. ఈ కార్యక్రమంలో మంచిర్యాల నగరపాలక సంస్థ కార్పొరేటర్లు సత్యవతి, చిలువేరు జ్యోతి, షేర్ పవన్, నాగరాజు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్లు కె. లక్ష్మణ్ రావు, పి. నాగ చందర్ రావు, బి. శోభ, స్వరూప రాణి, ఎం విజిత్ కుమార్, ఇంచార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ ఉజ్వల్ యెల్మే,  అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు