అమితాబ్‌కు ప్రమాదం
బిగ్ బీకి గాయం.. KBCలో కూర్చునే షో ఎందుకు చేశారు?
ముంబై: బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌కు ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 18’ (KBC 18) షూటింగ్లో అనుకోని ప్రమాదం ఎదురైంది. షూటింగ్ సమయంలో ఆయన ప్రమాదవశాత్తు జారిపడటంతో ఎడమ మోకాలికి గాయం(Amitabh Bachchan injury) అయింది. ఈ విషయాన్ని స్వయంగా అమితాబ్ బచ్చన్ తాజా KBC ఎపిసోడ్లో ప్రేక్షకులతో పంచుకున్నారు. సాధారణంగా KBC ఎపిసోడ్‌ను(KBC 18 latest episode) ఉత్సాహంగా స్టేజ్‌పై నిలబడి ప్రారంభించే బిగ్ బీ.. ఈసారి మాత్రం కూర్చునే తన ప్రారంభ ప్రసంగాన్ని కొనసాగించారు. దీనిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనగా, అసలు కారణాన్ని ఆయనే వివరించారు. షూటింగ్ సమయంలో జారిపడి మోకాలికి గాయం కావడంతో కొంతసేపు నిలబడటంలో ఇబ్బంది కలుగుతోందని తెలిపారు.
అయితే అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమితాబ్(Amitabh Bachchan) స్పష్టం చేశారు. గాయం తీవ్రమైనది కాదని చెబుతూ, కంటెస్టెంట్లతో మాట్లాడే సమయంలో మాత్రం నిలబడతానని తెలిపారు. గాయం ఉన్నప్పటికీ తన హోస్టింగ్ బాధ్యతలను కొనసాగించడంతో స్టూడియో ప్రేక్షకులు బిగ్ బీ( Big B injured) త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 83 ఏళ్ల వయసులోనూ KBC వంటి ప్రోగ్రామ్‌కు నిరంతరం హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అమితాబ్ బచ్చన్‌కు ఈ ఘటన జరగడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. అయితే ప్రస్తుతం ఆయన స్వయంగా ఇచ్చిన సమాచారం ప్రకారం గాయం తీవ్రంగా లేదని తెలుస్తోంది. Amitabh Bachchan injury, KBC 18 latest news, Amitabh Bachchan knee injury అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారాయి.