సోలార్ విద్యుత్‌పై విస్తృత ప్రచారం కల్పించాలి

01-10-2026 | 08:48pm
  1. ప్రతి వినియోగదారుడు సౌర విద్యుత్‌కు స్పాట్‌ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
  2. మంథని డీఈ ఆపరేషన్ వి. ప్రభాకర్

మంథని, అక్టోబర్ 1(విజయ క్రాంతి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సేవా సేతు అభియాన్‌ సదస్సులు విద్యుత్‌ వినియోగదారులకు మంచి అవకాశమని డీఈ ఆపరేషన్‌ మంథని వి. ప్రభాకర్(DE Operation Manthani V. Prabhakar) అన్నారు. మూడు రోజులపాటు నిర్వహించే శిబిరంలో ప్రతి వినియోగదారుడు తమ ఇళ్లపై సౌర విద్యుత్‌ పలకలు ఏర్పాటు చేసుకునేందుకు స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

సదస్సును ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ ఎన్‌పీడీసీఎల్‌, టీజీ రెడ్కో అధికారులు, బ్యాంకర్లు, వెండర్లు ఒకే వేదికపై అందుబాటులో ఉండటంతో ప్రజలకు సౌర విద్యుత్‌పై పూర్తి అవగాహన కల్పించే అవకాశం ఏర్పడిందన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు, ఉద్యోగులు నివసించే కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సుమారు 10 స్పాట్‌ రిజిస్ట్రేషన్లు జరిగాయి.

ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్‌ చైర్మన్‌ వోడ్నాల శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ ముస్కుల సహేందర్‌ రెడ్డి, ఈఆర్‌సీ సభ్యుడు శశిభూషణ్‌ కాచే, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడుదుల వెంకన్న, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌, బుద్ధర్తి బుచ్చయ్య, సహాయ లెక్కల అధికారి, సహాయ ఇంజనీర్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌, వెండర్లు, విద్యుత్‌ వినియోగదారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు