ఫిల్మ్ చాంబర్ వద్ద హైడ్రామా.. సుమలత ఎంట్రీతో ఉద్రిక్తత!
01-10-2026 | 05:04pm
హైదరాబాద్, ఆగస్టు 01,(విజయ క్రాంతి): ఫెడరేషన్ సమావేశం సందర్భంగా ఫిల్మ్ చాంబర్(Film Chamber) వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమావేశంలోకి సుమలత దూసుకురావడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఫెడరేషన్ నాయకులతో సుమలత వాగ్వాదానికి దిగారు. సమావేశానికి తనను అనుమతించకపోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను డాన్సర్స్ అసోసియేషన్(Dancers Association) అధ్యక్షురాలినని.. అలాంటప్పుడు ఫెడరేషన్ సమావేశానికి తనను ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. సమావేశంలోకి అనుమతించకపోవడంతో చాంబర్ బయటే సుమలత ఆందోళనకు దిగారు. దీంతో ఫిల్మ్ చాంబర్ పరిసరాల్లో కొంతసేపు టెన్షన్(Tension) వాతావరణం నెలకొంది.