మళ్లీ బయటకొస్తున్నా.. బొద్దింకలు!

01-10-2026 | 05:20pm

ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ కాక్రోచ్‌ జనతా పార్టీ(CJP) దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధమైంది. సీఈసీపై క్రిమినల్ కేసు(Criminal Case) నమోదు చేయాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) ప్రక్రియను నిలిపివేయాలని కూడా పార్టీ డిమాండ్‌ చేస్తోంది.

 జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయకపోతే అక్టోబర్‌ 2న ముంబయి నుంచి నిరసన కార్యక్రమాలను(Protest Programmes) ప్రారంభిస్తామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ప్రకటించారు. అనంతరం దేశంలోని ఇతర నగరాల్లోనూ ఆందోళనలు చేపడతామని తెలిపారు.SIR ప్రక్రియ, ఎన్నికల సంఘం(Election Commission) పనితీరుపై సీజేపీ పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. ఈ డిమాండ్లతో ముంబయిలో చేపట్టనున్న నిరసనతో దేశవ్యాప్తంగా ఆందోళనలను విస్తరించేందుకు పార్టీ సిద్ధమవుతోంది.

మరిన్ని వార్తలు