అంగన్వాడీ టీచర్లకు ఘన సన్మానం
01-10-2026 | 08:27pm
బెల అక్టోబర్ 01(విజయక్రాంతి): మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సేవ సంకల్ప అభియాన్(Seva Sankalp Abhiyan) కార్యక్రమంలో భాగంగా గురువారం అంగన్ మిలన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్లను నాయకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు.ముఖ్య అతిథిగా అదిలాబాద్ బిజెపి మహిళా మోర్చా ఉప అధ్యక్షులు నిపుంగి దివ్య మహిళా మోర్చా మెంబర్ పూసం పార్వతి బాయ్ బేల అంగన్వాడీ టీచర్స్ ఓల్లవర్ అనిత సునీత ఆశ వర్కర్ ప్రమీల బేల బిజెపి నాయకులు తదితరాలు పాల్గున్నారు.