బిజెపి పార్టీ ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లకు సన్మానం

01-10-2026 | 08:34pm

ఎర్రుపాలెం,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సేవా సంకల్ప అభయాన్(Seva Sankalp Abhiyan - Jan Seva Hi Prabhu Seva) కార్యక్రమంలో భాగంగా జిల్లా పార్టీ ఆదేశాల మేరకు  ఎర్రుపాలెం మండల అధ్యక్షుడు అనుమోలు సురేష్, జిల్లా నాయకులు నూతక్కి నరసింహారావు ఆధ్వర్యంలో బిజెపి నాయకులు అంగన్ మిలన్ సేవా కార్యక్రమంలో భాగంగా మండలంలోని అంగన్వాడి టీచర్లను వారి సేవలు గుర్తించి గురువారం అంగన్వాడి టీచర్లకు సన్మానం చేశారు. మండలంలోని రేమిడిచర్ల, లక్ష్మీ నగర్, అంగన్వాడీ, టీచర్, ఆదిలక్ష్మి, రేమడిచర్ల, అంగన్వాడి, టీచర్లు, రాధ, యోగేశ్వరి, అరుణ,టీచర్లను, సన్మానించారు.

సఖినివీడు గ్రామంలో రెండు అంగన్వాడి సెంటర్ లను సందర్శించి అంగన్వాడి టీచర్ని ఆయాను మరియు ఆశ వర్కర్లను  శాలువ తో సన్మానించారు. ఈ సందర్భంగా పిల్లలకు గర్భిణీ స్త్రీలకు అందించే పౌష్టికాహారం వివరాలు అడిగి తెలుసుకున్నారు. . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లబ్ధిదారులు పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా కార్యవర్గ సభ్యులు నూతక్కి నరసింహారావు,కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి కొమ్మినేని కృష్ణారావు మండల ఉపాధ్యక్షులు రావిరాల అచ్చారావు , సఖినివీడు గ్రామ బూత్ అధ్యక్షులు వేమిరెడ్డి సత్యనారాయణరెడ్డి  స్థానిక నాయకులు అంగన్వాడీ  సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు